సత్యసాయి: కార్తీక అమావాస్య సందర్భంగా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక వైభవాన్ని పురస్కరించుకుని మహిళలు ధాత్రీ దేవత (ఉసిరి చెట్టు)కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో కార్తీక దీపాలను వెలిగించి, నీటిలో వదిలారు. ఈ దీపోత్సవంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.