AP: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండి పడింది. పల్నాడు వీరుల తిరునాళ్లతో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు NSP అధికారులు గండి పూడ్చే పనులను చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.