BDK: చిన్న వయసు నుంచే సేవా దృక్పథంతో అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో ఆమె వృద్ధాశ్రమాన్ని స్థాపించారని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. సామాజిక సేవకురాలు షహనాజ్ బేగంను సన్మానించారు. కుల, మతాలకు అతీతంగా వృద్ధాశ్రమాన్ని నడపడం ద్వారా ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. వృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో ఘనంగా జరిగింది.