BDK: టీయూసీఐ జిల్లా కార్యదర్శి యాకుబ్ షావలి గురువారం ఇల్లందు మున్సిపాలిటీ వాటర్ సప్లై విభాగంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ దేశానికి సంపదను సృష్టిస్తున్న కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోగా, కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు.