MBNR: కక్ష సాధింపు చర్యలకు దిగే ఆలోచన తమకు ఏమాత్రం లేదని జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతసేపు అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెడుతుందన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా జైలుకు వెళ్లాల్సిందని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి వెల్లడించారు.