KNR: జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను DEO సస్పెండ్ చేశారు. హుజురాబాద్ పాఠశాల టీచర్లు ప్రవీణ్ కుమార్, సమ్మయ్య మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు రాగా, చెల్పూర్ టీచర్ ఐలయ్య విధుల్లో నిర్లక్ష్యంపై అధికారుల ఆదేశాలు పాటించకపోవడం వంటి కారణాలతో వేటుకు గురయ్యారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో సస్పెండ్ చేశారు.