MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కల్లెపు పద్మ అనే వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారం గ్రామస్తులు, మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని ఇంట్లో ఆమానుషంగా హత్య చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.