ATP: జిల్లా నేత రమేష్ గౌడ్‌కు వైసీపీలో కీలక పదవి వరించింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయనను బీసీ విభాగం జోనల్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు జోనల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రమేష్ గౌడ్ తెలిపారు.