AP: శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను కొనుగోలు చేసేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్‌తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.