తెలంగాణలోని ఓ పల్లెటూరులోని ప్రేమ కథతో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇవాళ విడుదలైంది. బ్యాండ్ వాయించే రాజు(అఖిల్), రాంబాయి(తేజస్విని) ప్రేమించుకుంటారు. వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి? చివరికి వారి ప్రేమను గెలిపించుకున్నారా? అనేది కథ. నటీనటుల నటన, ప్రేమకథను నడిపిన తీరు, క్లైమాక్స్ మూవీకి ప్లస్. నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్లో కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్:2.75/5.