సౌతాఫ్రికాతో రేపు జరగనున్న డూ ఆర్ డై టెస్టుకు టీమిండియా కెప్టెన్ గిల్ దూరమయ్యాడు. మెడనొప్పితో బాధపడుతున్న అతనికి ఇవాళ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించగా.. అందులో ఫెయిల్ అయ్యాడు. దీంతో జట్టు నుంచి అతణ్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ముంబైకి బయలుదేరిన అతను అక్కడ వైద్య నిపుణులను కలవనున్నాడు. అటు రేపటి టెస్టులో భారత్‌ను పంత్ నడిపించనున్నాడు.