కాకినాడ నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్గా జిల్లా హౌసింగ్ పీడీ ఎస్. సత్యనారాయణ నియమితులయ్యారు. గత కమిషనర్ భావన బదిలీ కావడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. పూర్తి అదనపు బాధ్యతలతో సత్యనారాయణను ఇంఛార్జ్ కమిషనర్గా నియమిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి షన్మోహన్ సగలి ఉత్తర్వులు జారీ చేశారు.