VZM: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఆదేశాలతో కొత్తవలస కూడలిలో శుక్రవారం అభ్యుదయ సైకిల్ ర్యాలీ నిర్వహించి, పలు కళాశాల విద్యార్థులతో అవగాహన కల్పించారు. విజయనగరం టౌన్ డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించిన, కలిగిన 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.