AP: పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండి పడటంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తమైన గండిని పూడ్చేయటంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాగా అర్థరాత్రి ఎస్కేప్ ఛానల్ వద్ద గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగిన విషయం తెలిసిందే.