అన్నమయ్య: కబ్జాదారుల నుంచి తమ స్థలాలను కాపాడి న్యాయం చేయాలని మదనపల్లె DSP మహేంద్రను భాగ్యనగర్ వెంచర్ బాధితులు వేడుకున్నారు. వారు మాట్లాడుతూ పోతబోలు పంచాయితీలో వేసిన వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. కానీ కొంతమంది తమను అక్కడకు రానీయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు రక్షణ కల్పించాలని వారు కోరారు.