AP: జనవరి నుంచి చిత్తూరు జిల్లావ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తామని, జనవరి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల వైద్యకళాశాలల నిర్మాణంపై చర్చించారు. పీపీపీ ప్రాతిపదికన వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతామన్నారు. విద్యార్థులు, ప్రజలు, సామాజిక ప్రయోజనం దృష్ట్యా ఈ విధానం తీసుకొచ్చామన్నారు.