చలికాలంలో టమోటా సూప్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమోటాలలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రోస్టేట్, లంగ్స్, జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. లైకోపీన్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.