AP: పార్వతీపురం మన్యం జిల్లాలో రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతి గ్రామానికి ఆటో, అంబులెన్స్ వెళ్లాలని, తాము అధికారంలోకి వచ్చాక 200కు పైగా గ్రామాలకు రహదారులు వేశామన్నారు. మిగిలిన 284 గ్రామాల్లో రెండేళ్లలో రహదారులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రహదారుల నిర్మాణంలో అటవీశాఖ అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలన్నారు.