థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చేసిన ఫాతిమా బాష్ అందాల కిరీటం గెలుచుకుంది. అయితే అవమానపడిన చోటే అందాల రాణిగా ఆమె నిలిచింది. ఈ పోటీలు ప్రాంభమైన తొలి రోజుల్లో ఫాతిమా ఓ షూట్‌కు హాజరుకాకపోవడంతో.. అక్కడి అధికారి ఆమెను తెలివితక్కువ వ్యక్తి అనే అర్థం వచ్చేలా తిట్టారు. ఇది వైరల్ అవ్వడంతో ఆ అధికారి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.