భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మురికివాడల్లో మున్సిపల్ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన తనలాంటి వ్యక్తి ఇంతటి ఉన్నతస్థాయికి రావడానికి అంబేద్కర్, భారత రాజ్యాంగం ప్రధానకారణమని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం రాయకపోయి ఉంటే తనలాంటి విద్యార్థి ఇంతస్థాయికి రావడం గురించి కనీసం కలలో కూడా ఊహించలేమని పేర్కొన్నారు.