CTR: చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సీసీ రోడ్లు, కాలువలు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ పరిధిలో 7వ వార్డులోని బాపూజీ నగర్, 46వ వార్డు విజయలక్ష్మి కాలనీలో రూ. 28.90లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, కాలువలను పరిశీలించారు.