యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. 31 పరుగులకే నలుగురు ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో హెడ్(1), గ్రీన్(0) ఉండగా.. వెదర్లాండ్(0), లబుషేన్(9), స్మిత్(17), ఖవాజా(2) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, కార్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ బ్యాటర్లు కూడా తడబడి 172 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే.