TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు రెండుసార్లు హాజరయ్యానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్నారు. ప్రస్తుతం ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు. పిటిషనర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ మారినట్లు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.