VZM: రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్, కార్యకర్తే అధినేత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.