గౌహతి టెస్టుకు ముందు యశస్వీ జైస్వాల్కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచన చేశాడు. ఈగో పక్కన పెట్టి కొంచెం టైం తీసుకొని ఆడాలని సూచించాడు. 3 ఫార్మాట్లలోనూ లెఫ్టార్మ్ బౌలర్లపై యశస్వీ ఆడలేకపోతున్నాడని, లోపాలు అంగీకరిస్తేనే మెరుగుపరుచుకోగలమని పేర్కొన్నాడు. కాగా తొలి టెస్టు 2 ఇన్నింగ్సుల్లోనూ యశస్వీ SA లెఫ్టార్మర్ యాన్సెన్కే వికెట్ అప్పగించుకున్నాడు.