AP: అనకాపల్లి జిల్లా రాజానగరం పాఠశాల కళావేదిక శ్లాబ్ నిర్మాణంలో క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ మృతిచెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉపాధ్యాయురాలు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.