TG: ఎన్కౌంటర్లు చట్ట వ్యతిరేకమని ప్రొ. హరగోపాల్ అన్నారు. ఇరువైపుల కాల్పులు జరిగితే అది ఎన్కౌంటర్ అవుతుందని తెలిపారు. చంపే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తున్నారని.. రాహుల్ గాంధీని కూడా నక్సలైట్ అంటున్నారని మండిపడ్డారు. వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.