ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు రోజూ ఓ టీస్పూన్ అశ్వగంధ పొడి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఔషధ, పోషక గుణాలు సంతానోత్పత్తితో పాటు కండరాలు, ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయని అంటున్నారు. ఇందుకోసం అశ్వగంధను పాలు లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.