చైనా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. అణు పేలుళ్లను తట్టుకునేలా తేలియాడే ద్వీపాన్ని డ్రాగన్ దేశం నిర్మిస్తోంది. అరుదైన అణు పేలుడు నిరోధక డిజైన్తో రూపొందుతున్న ఈ ద్వీపానికి ‘డీప్ సీ ఆల్ వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ’ అని పేరు పెట్టింది. ఇది 2028లో తన సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం.