WNP: పెద్దమందడి మండల కేంద్రంలోని జగత్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం భవనానికి శుక్రవారం ఎమ్మెల్యే మెఘారెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ. 20 లక్షలతో నూతన పంచాయతీ భవనం నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు.