భారత T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ నెల 26 నుంచి జరగనున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ఆడనున్నాడు. T20WC 2026 సన్నాహాల దృష్ట్యా SKY ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే తమ జట్టు ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఆటకు దూరం కావడంతో.. సారథ్య బాధ్యతలను SKY చేపట్టనున్నాడు. అటు శివమ్ దూబే కూడా అందుబాటులో ఉండనున్నట్లు ముంబై జట్టు వర్గాలు తెలిపాయి.