GNTR: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.