ATP: శింగనమల వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.