AP: ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్బంగా మత్స్యకార సోదరులు, ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బ్లూ ఎకనామీలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని, జీఎస్డీపీలోనూ మత్స్యరంగానిదే అగ్రస్థానం అని తెలిపారు. ఆక్వారంగం బలోపేతానికి రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నట్లు వెల్లడించారు. వేటనిషేధం సమయంలో రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పారు.