KDP: కడప కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మనోజ్ రెడ్డి శుక్రవారం ఉదయం నార్త్, వెస్ట్ జోన్లలో పర్యటించారు. చెన్నూర్ బస్టాండ్ వద్ద ప్రజలు, వార్డ్ వర్కర్స్‌తో మాట్లాడారు. చెత్త సేకరణ, కాలువల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. రోజు తప్పకుండా చెత్త తొలగించాలని, కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలు త్వరగా క్లీన్ చేయాలని సూచించారు.