ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. చాందసవాద భావజాల వ్యాప్తిని సోషల్ మీడియాలో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సోషల్ మీడియా వేదికలతో టచ్లో ఉండాలని సూచించారు. రద్దీ మార్కెట్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని తెలిపారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.