AP: పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో అంతర్జాతీయ యువజన సమ్మేళన సదస్సు ప్రారంభమైంది. యువజన సమ్మేళనానికి ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాగా, సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఇటీవల ప్రధాని మోదీ తదితర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే.