VSP: కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా ప్రారంభించారు. అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేకపూజలు, మాస పూజ నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు ప్రసాద కౌంటర్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలిపాడ్యమి కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉండగా, నెలరోజుల్లో 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.