BDK: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతుతో పాటు అదనంగా 500 బోనస్‌ను పొందాలని సొసైటీ ఛైర్మన్ మండే వీర హనుమంతరావు తెలిపారు. శుక్రవారం వారు సుజాతనగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఏఈఓ వద్ద టోకెన్ తీసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.