పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో స్టోక్స్ సేన 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో పోప్(46), బ్రూక్(52) మినహా ఎవరూ రాణించలేదు. అటు ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు పడగొట్టగా.. డెబ్యూ ప్లేయర్ డాగెట్ 2 వికెట్లు తీసుకున్నాడు.