TG: బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవని గుర్తు చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని.. అలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు. బీసీలను మభ్య పెట్టడానికి పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని డ్రామాలాడుతోందని మండిపడ్డారు.