KRNL: పెద్దకడబూరు మండలం కంబలదిన్నెలో శుక్రవారం ‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత పనులు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో పారిశుద్ధ్యం నెలకొల్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపిడివో ప్రభావతి దేవి తెలిపారు. ఈ పనులను మండలంలోని డిప్యూటీ MPDO, పంచాయితీ కార్యదర్శులు పాల్గొని పర్యవేక్షించారు.