BDK: పినపాక మండలంలోని రైతు వేదికలో జరుగుతున్న ఇంటింటి సర్వే సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం పాల్గొని సర్వే అధికారులు, సర్వే సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే ఉద్యోగులు విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గొంది గోపాలకృష్ణ, వివిధ శాఖల మండల అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.