AP: రంపచోడవరం ఆస్పత్రి మార్చురీలో 9 మంది మావోయిస్టు మృతదేహాలు ఉన్నాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు పోలీసులు అప్పగించనున్నారు. మార్చురీలో జ్యోతి, మల్లా, షమ్మి, లోకేష్, సురేష్, అనిత, వాసు, లక్ష్మణ్, కమలేష్ మృతదేహాలు ఉండటంతో ఆస్పత్రి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. హిడ్మా, రాజే, టెక్ శంకర్, దేవె మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే.