ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడు డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది. హంజుల్లా అనే జైషే మహ్మద్ హ్యాండ్లర్ 42 వీడియోలను అతడికి పంపినట్లు సమాచారం.