AP: గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్య ఉత్పత్తి పెంపు, సాంకేతికత ప్రోత్సాహం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ పోటీకి ఆక్వా రంగాన్ని సిద్ధం చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి మత్స్యకారులకు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.