ప్రకాశం: పామూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి అరవింద ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికుల చేత మురుకు కాలవలను శుభ్రం చేయించడం జరిగింది. అనంతరం JCB సహాయంతో చెట్లు తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.