ATP: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాతృమూర్తి సాకే గంగమ్మ (85) అనారోగ్యంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య అనంతపురంలోని వారి నివాసానికి చేరుకున్నారు. గంగమ్మ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే, శైలజానాథ్ కుటుంబసభ్యులకు రంగయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు.