బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా, గౌహతి, అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లో భూప్రకంపనలు సంభవించాయి.