KDP: చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ వద్ద మహిళ మృతదేహం కలకలం రేపింది. కేసీ కెనాల్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీని గురువారం గుర్తించారు. మహిళ వయసు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. మూడు వారాల క్రితం చనిపోయి ఉండొచ్చని.. శరీరంపై ఎలాంటి దుస్తులు లేవని చెప్పారు.